రోజూ ఉదయం ఆలస్యంగా లేస్తున్నారా.. నష్టాలు ఏమిటో తెలుసా

05 April 2024

TV9 Telugu

Pic credit - Pexels

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి, పోషకాహారం అధికంగా ఉండే ఆహారాన్ని తినడమే కాదు, తగినంత నిద్ర తప్పని సరి. నిద్రపోవడం, మేల్కొనే విషయంలో సరైన దినచర్యను అనుసరించాలి.

ఆరోగ్యంగా ఉండేందుకు

పని కారణంగా లేదా అర్థరాత్రి వరకు మొబైల్ ఉపయోగించడం వంటి వాటి కారణాలతో ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం సాధారణంగా మారింది. అయితే ఇది చాలా హానికరం.

అర్ధరాత్రి వరకూ మొబైల్ 

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల ఒత్తిడి, మూడ్ స్వింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు.

ఒత్తిడి

తెల్లవారే వరకు నిద్రపోతే అల్పాహారం, భోజనం చేసే సమయాల్లో మార్పులు వస్తాయి. జీవక్రియ  నెమ్మదిస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

ఊబకాయం సమస్య

ఉదయాన్నే మేల్కొనడం కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. అయితే ఆలస్యంగా మేల్కొనడం వల్ల రోజంతా భారంగా అనిపిస్తుంది. పనిపై ప్రభావం చూపుతుంది.

తక్కువ శక్తి, అలసట

ఆలస్యంగా నిద్రలేవడం వల్ల సమయానికి మలవిసర్జన జరగదు. దీనివల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

జీర్ణ సమస్యలు

ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల మొత్తం దినచర్యలో మార్పులు వస్తాయి. ఆహారం నుంచి పని చేయడం వరకు, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

దినచర్యలపై ప్రభావం 

ఆలస్యంగా నిద్రలేస్తే.. మానసిక ఆందోళన ఒత్తిడి, డిప్రెషన్, చిరాకు, కోపం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. 

మానసిక ఆందోళన ఒత్తిడి