ఓట్ ఫ్రం హోమ్ .. వారికి గొప్ప అవకాశం
22 October 2023
80 ఏళ్ల వృద్ధుల ఇబ్బందులను గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా వారికి పరిష్కార మార్గం చూపింది.
80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే వెసలుబాటు కల్పించింది భరత ఎలక్షన్ కమిషన్.
ఇందుకోసం దరఖాస్తు ఎలా చేయాలి.. సంబంధిత ఫాం ఎలా నింపాలి అనే దానిపై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వయసు సహకరించకపోవడం.. అనారోగ్యంతో ఇంటికే పరిమితమై ఓటు వేయలేకపోయిన వారి కోసం ఈ విధానాన్ని తెచ్చింది ఎలక్షన్ కమిషన్.
ఖమ్మం జిల్లాలో ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అర్హత గల 36,053 మంది సీనియర్ సిటిజన్లకు ఇదో మంచి అవకాశంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సత్తుపల్లిలో, తక్కువగా పాలేరులో 80 ఏళ్ల వయసు దాటిన వారున్నారని గుర్తించారు.
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు తర్వాత వీరికి 12డీ ఫాంల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
ఈ నిర్ణయంతో జిల్లాలోని వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. ఓటింగ్ శాతం వందకు వంద జరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి