23 November 2024
Pic credit - Getty
TV9 Telugu
విటమిన్ డి మన శరీరానికి అవసరమైన మూలకం. శరీరంలో అనేక రకాల విటమిన్లు ఉన్నా.. కొవ్వులో కరిగే విటమిన్ ఇది. ఇందులో విటమిన్ D1, D2 మరియు D3 ఉంటాయి.
ఈ విటమిన్ డి శరీరానికి సూర్యరశ్మిని నేరుగా తీసుకోవడం వల్ల లభిస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు, సప్లిమెంట్ల ద్వారా కూడా లభిస్తుంది.
విటమిన్ డి లోపం ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అలసట, నొప్పి, ఎముకలలో బలహీనత, ఒత్తిడి, శరీరంపై పగుళ్లు వచ్చే ప్రమాదం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, దానిని భర్తీ చేయడానికి ప్రజలు ఆహారాన్ని తీసుకుంటారు. అయితే కొన్ని పదార్థాలు తినకూడదు. ఈ ఆహార పదార్థాలు ఈ పోషకాల లోపాన్ని మరింత పెంచుతాయి
విటమిన్ డి తక్కువగా ఉంటే రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగవచ్చు. అంతకంటే ఎక్కువ సార్లు టీ లేదా కాఫీలను తాగవద్దు.
విటమిన్ డి లోపం ఉన్నవారు రెడ్ మీట్, చేపలు, గుడ్లు, చికెన్ వంటి నాన్-వెజ్ ఆహారం తినొద్దు. నూనె, మసాలాలతో చేసిన ఈ ఆహారం తింటే జీర్ణం కావడంలో సమస్యలు ఏర్పడతాయి. అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మార్కెట్‌లో లభించే జంక్ ఫుడ్‌ను జీర్ణం చేయడం అంత సులభం కాదు. దీంతో అధిక కొలెస్ట్రాల్, కొవ్వు కాలేయం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. గుండెకు ముప్పు వాటిల్లుతుంది.
చింతపండు, ఊరగాయ వంటి పుల్లని ఆహారం తినొద్దు. ఇవి విటమిన్ డిని తగ్గిస్తాయి. ఎముకల్లో నొప్పి, వాపు ఉన్నవారు పుల్లని ఆహరాన్ని తినొద్దు. వీటిని తింటే కీళ్లనొప్పుల సమస్య పెరుగుతుంది