అతిగా నిద్రపోతున్నారా.. ఈ విటమిన్ల లోపం ఏమో చెక్ చేసుకోండి 

31 August 2024

TV9 Telugu

Pic credit -  Pexels

మన శరీరంలోని ప్రతి అవయవం సజావుగా పనిచేయడానికి ఖనిజాలు, విటమిన్లు అవసరం. అందువల్ల ఆరోగ్యం, పోషకాలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి.

పోషకాలు-ఆరోగ్యం

శరీరంలో ఏదైనా విటమిన్ లేదా మినరల్ లోపం ఉంటే.. శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని విస్మరించకూడదు.

పోషకాల లోపం

రాత్రికి సరిపడా నిద్రపోయిన తర్వాత కూడా.. రోజంతా నీరసంగా, నిద్రగా, బద్ధకంగా, అలసటగా అనిపిస్తే, ఏమైనా విటమిన్ల లోపం ఉందేమో తెలుసుకోండి.

నిద్ర- బద్ధకం

శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే ఎర్ర రక్త కణాలు తగ్గి ఉండొచ్చు. ఇది నరాలలో బలహీనతకు దారితీస్తుంది. నిద్రపోవడం, సోమరితనం వంటి అనుభూతికి దారితీస్తుంది.

విటమిన్ బి12

శరీరంలో విటమిన్ B6 లోపం వల్ల దుఃఖం, చిరాకు, బద్ధకం, నిద్ర సమస్యలు, చేతులు, కాళ్ళలో ముడతలు పడటం, తిమ్మిరి మొదలైన సమస్యలు వస్తాయి.

B6 లోపం

శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే అలసట, కండరాల నొప్పి , బలహీనత, విచారంగా అనిపించడం, వెన్నునొప్పి మొదలైన సమస్యలు మొదలవుతాయి.

విటమిన్ డి

శరీరంలో పోషకాల లోపం లేకుండా చూసుకోవాలంటే చిరు ధ్యాన్యాలు, తృణధాన్యాలు, పచ్చి కూరగాయలు, రంగురంగుల పండ్లు, పాల ఉత్పత్తులు మొదలైన వాటిని సమతుల్యంగా ఆహారంలో చేర్చుకోవాలి.

సమతుల్య ఆహారం తీసుకోండి