ఆ కోరిక తగ్గుతోందా.? షుగర్‌ కావొచ్చు. 

TV9 Telugu

17 February  2024

షుగర్‌ వచ్చిన వారికి కనిపించే ప్రధాన లక్షణాల్లో తరచూ మూత్రం రావడం ఒకటని అందరికీ తెలిసిందే. ఈ సమస్య ఎక్కువ రోజులుగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

ఇక నిత్యం గొంతు ఎండిపోతున్నట్లు అనిపించినా, దాహం ఎక్కువగా అవుతున్నా షుగర్‌కు లక్షణంగా భావించాలి. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. 

ఇక కొందరి మధుమేహం కారణంగా శృంగార కోరికలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉంటే షుగర్‌గా భావించాలని చెబుతున్నారు. 

కొంత మందిలో షుగర్‌ లెవెల్స్‌ పెరిగితే కళ్లపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంగా కళ్లు మసకబారుతున్నట్లు అనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. 

కొందరిలో పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. ఇది కూడా షుగర్‌ లక్షణంగా భావించాలి. చిగుళ్ల నుంచి రక్తం వచ్చినా వెంటనే అలర్ట్‌ అవ్వాలి. 

కొందరిలో కాళ్లు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి లక్షణం దీర్ఘకాలంగా ఉంటే షుగర్‌ వచ్చినట్లే భావించాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇక చర్మం ముడతపడుతున్నట్లు కనిపించినా వెంటనే షుగర్‌ టెస్ట్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా షుగర్‌కు సూచికగా చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.