ఎండాకాలంలో బాగా కాసే కూరగాయలు ఇవే.. తప్పక బాల్కనీలో పెంచాల్సిందే!

Anand T

13 may 2026

తక్కువ నిర్వహణతో చిన్న కుండీల్లో కూడా అద్భుతంగా పెరుగుతాయి. ఒక్కసారి నాటితే సీజన్ మొత్తం కాపు వస్తుంది. నీరు ఎక్కువగా పోయకండి, మట్టి ఆరినప్పుడు మాత్రమే పోయాలి. వేసవిలో ఇవి గాఢమైన రుచిని ఇస్తాయి.

పచ్చిమిర్చి

బెండ మొక్కలు వేడిని తట్టుకోగలవు. ఇవి నిలువుగా పెరుగుతాయి కాబట్టి బాల్కనీలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. వీటికి కొంచెం లోతైన కుండీలు అవసరం. ఎప్పటికప్పుడు కాయలు కోస్తుంటే కొత్త మొగ్గలు వస్తూనే ఉంటాయి కంగా చెప్పాల్సిన పని లేదు.

బెండకాయ 

వంకాయ మొక్కలు చూడటానికి అందంగా ఉండటమే కాకుండా, వేసవిలో మంచి దిగుబడిని ఇస్తాయి.గుత్తి వంకాయ లేదా పొడుగు వంకాయ రకాలను ఎంచుకోవచ్చు. వీటికి చీడపీడలు రాకుండా వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ (వేప నూనె) స్ప్రే చేయండి.

వంకాయ

దోసకాయ లేదా కాకరకాయ వంటి తీగ జాతులను చిన్న గ్రిల్స్ లేదా నెట్స్ సహాయంతో పైకి పాకించవచ్చు. ఇది వేసవిలో శరీరానికి చలువ చేస్తుంది. తీగలు పాకడానికి తగినంత స్థలం ఉండేలా చూసుకోండి. కంగా చెప్పాల్సిన పని లేదు.

దోసకాయ 

ఆకుకూరల్లో తోటకూర వేసవి ఎండలను బాగా తట్టుకుంటుంది. ఇది చాలా వేగంగా పెరుగుతుంది. విత్తనాలు చల్లిన 25-30 రోజుల్లోనే కోతకు వస్తుంది. నేరుగా ఎండ తగిలే చోట ఉంచితే ఆకులు ఏపుగా పెరుగుతాయి. కంగా చెప్పాల్సిన పని లేదు.

తోటకూర 

టమోటాలు ఎండను బాగా ఇష్టపడతాయి, కాబట్టి బాల్కనీలో పెంచడానికి ఇవి సరైనవి. చెర్రీ టమోటాలు కుండీలకు చాలా అనుకూలం.వీటికి కనీసం 6-8 గంటల ఎండ అవసరం. మొక్క పెరిగే కొద్దీ సపోర్ట్ కోసం కర్రలను వాడండి. కంగా చెప్పాల్సిన పని లేదు.

టమోటాలు 

వేసవి పానీయాల్లో, చట్నీల్లో పుదీనాకు ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని పెంచడం చాలా సులభం. దీన్ని పెంచడానికి వెడల్పాటి కుండీ ఉండాలి. మార్కెట్ నుండి తెచ్చిన పుదీనా కాడల ద్వారా కూడా వీటిని పెంచవచ్చు. దీనికి మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి.

పుదీనా

ఈ మొక్కలకు వేసవిలో ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే నీరు పోయాల్సి ఉంటుంది. ఇంట్లోనే తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ నెలకు వీటికి వేయడం ద్వారా కాపు మంచిగా వస్తుంది.

సంరక్షణ