మలబద్దకం వేధిస్తోందా.? ఈ కూరగాయలతో రాపిడ్ రిలీఫ్..
29 September 2025
Prudvi Battula
పాలకూరలో ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు పాలకూర తినడం మంచిది.
ఫైబర్ అధికం ఉన్న చిక్కుడు, బీరకాయ, సోరకాయ, దొండకాయ వంటి కూరలు తింటే మలబద్ధకం సమస్యకు చెక్ త్వరగా చెక్ పెట్టవచ్చు.
క్యారెట్లలో పైబర్, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున దినాన్ని తింటే మలవిసర్జన సాఫీగా జరిగి మలబద్దకం తగ్గుతుంది.
బీన్స్‌లోని ఫైబర్, ప్రోటీన్ పేగు కదలికలను మెరుగుగుపరచడంలో తోడ్పడతాయి. దీంతో మలబద్దకం తగ్గి మలవిసర్జన సాఫీగా అవుతుంది.
సెల్యూలోజ్, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉన్న కాలీఫ్లవర్ పేగుల్లో మలం పేరుకుపోకుండా చేసి మలబద్దకాన్ని దూరం చేస్తాయి.
బ్రోకలీ కూడా మలబద్ధకం ఉన్నవారికి మంచి ఎంపిక. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పేగుల్లో మలం పేరకుపోకుండా చూస్తాయి.
ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఎక్కువుగా లభించే చిలగడదుంపలు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తాయి.
పెరుగు, యోగర్ట్, కంబూచ, కిమ్చి వంటి ఆహారాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి మలబద్ధకం దూరం చేస్తాయి. దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
వాటర్ ఎక్కువగా తాగడం వల్ల కూడా మలబద్దకాన్ని నివారించవచ్చు. దీనివల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ మొక్కలు ఉంటే.. ఇంటికి అరిష్టం.. వెంటనే తొలగించండి..
రోజుకు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్.. ఆ సమస్యలన్నీ ఖతం..
చేప తల తింటే.. అన్లిమిటెడ్ బెనిఫిట్స్