గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే..!

Jyothi Gadda

11 July 2024

వాస్తు శాస్త్రంలో గోడ గడియారాలు అదృష్టానికి సంబంధించినవిగా చెబుతారు.. కాబట్టి, ఇంట్లో గోడకు గడియారం తగిలించే ముందు కొన్ని నియమాలను పాటించాలి.

వాల్ క్లాక్‌ని తూర్పు, పశ్చిమం, ఉత్తరం వైపున్న గోడకు వేలాడదీయవచ్చు. కానీ పొరపాటున కూడా దక్షిణం వైపు గోడకు వేలాడదీయవద్దు అని వాస్తుశాస్త్రం చెబుతోంది.

ఇంటి మెయిన్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ డోర్‌కి వాల్ క్లాక్‌ని అస్సలు పెట్టొద్దు. అలా చేస్తే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. అనవసర వివాదాలు, కష్టాలు, నష్టాలు, నిత్య ఓటమి తప్పదు.

వాస్తు ప్రకారం ఆగిన, విరిగిన, పగిలిన, పాడైన, చిరిగిన, దెబ్బతిన్న వాచీలు, వాల్ క్లాక్‌లను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలా ఉంచితే మీ లైఫ్ లో సంతోషం ఆగిపోతుందని చెబుతారు.

గోడగడియారం ఉత్తరం వైపు వేలాడదీయడం వల్ల సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. ఉత్తరం దిశ కుబేరుడు, వినాయకుడి దిశగా పరిగణిస్తారు. అందుకే ఉత్తరం గోడకు గడియారం శుభప్రదం.

తూర్పువైపు గడియారం వేలాడదీస్తే ఇంటికి వృద్ధిని ఇవ్వడమే కాకుండా మీ పనుల్లో నాణ్యతను పెంచుతుంది. గుండ్రటి గడియారంతో ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది.

వాస్తు ప్రకారం గోడగడియారం ఎప్పుడూ దక్షిణ దిశ గోడకు పెట్టకూడదు. దక్షిణం స్థిరత్వానికి దిక్కు. ఈ దిశలో గడియారాన్ని పెట్టడం వల్ల మీ ఇంటి పురోగతిని నెమ్మదిస్తుంది. 

దక్షిణ దిశకు యముడు అధిపతి. ఈ దిశలో గడియారాన్ని పెడితే ఇంటి పెద్ద అనారోగ్యం పాలవుతారు. వ్యర్థాలు పెరిగిపోతాయి. ఇంట్లో ఎన్నో సమస్యలతో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.