మీరు సీమ చింతను తిన్నారా? ఇది ఆరోగ్యానికి ఒక వరం

17 February 2024

TV9 Telugu

ఈ సీమ చింత.. కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, గట్టిగా వగరు రుచితో ఉంటాయి. పక్వానికొస్తున్న కొద్దీ బంగారు రంగు, గులాబీ, ఊదా నుంచి ఎరుపు రంగును సంతరించుకుంటాయి.

పక్వానికొస్తున్న కొద్దీ

కాయలు పండుతున్నపుడు పైన తొక్క విడిపోతుంది. లోపల ఒక్కొక్క కణుపులోనూ తెల్లటి పల్చటి గుజ్జు ఒలిస్తే నల్లటి గింజలుంటాయి. గుజ్జు కొద్దిగా వగరుగా, తియ్యగా ఉంటుంది 

వగరుగా, తియ్యగా

నీటిశాతం ఎక్కువగా ఉండే సీమచింతలో ఔషధ విలువలు అధికం. క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, విటమిన్ సి, బి1, బి2, సహా పోషకాలు మెండుగా ఉన్నాయి.

ఔషధ విలువలు

పొటాషియం సీమ చింతలో లభిస్తుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.  గుండెకు ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండెకు ప్రయోజనకరం

జంగిల్ జిలేబీ తినడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణం వంటి సమస్యల నుండి దూరంగా ఉంటారు. 

జీర్ణశక్తి

సీమ చింతకాయలలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా రక్షిస్తుంది

రోగనిరోధక శక్తి బూస్టర్

దీనిలో ఉన్న క్యాల్షియం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఎముకలను కూడా ధృడంగా ఉంచుతుంది. అంతేకాదు గర్భిణీలకు మంచి పోషకాలను ఇస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

గర్భిణీ స్త్రీలకు

జంగిల్ జలేబిలో ఐరెన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కనుక  రక్తహీనత ఉన్నవారికి మంచి సహాయకారి. 

హిమోగ్లోబిన్ పెరుగుతుంది