నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నారా.. అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాలి..

10 August 2023

ప్రస్తుతం దాదాపు అందరు నాన్ స్టిక్ పెనం వాడుతున్నారు. ముఖ్యంగా దోశను నాన్‌ స్టిక్ పెనంపై వేస్తుంటారు.

ఎందుకంటే దీనికి పిండి అట్టుకోదు దోశ బాగా వస్తుందని ఇనుప పెనాన్ని పక్కన పడేసి నాన్‌స్టిక్‌ పెనం తెచ్చుకుంటున్నారు.

కానీ నాన్ స్టిక్ ప్యాన్ వాడడం వల్ల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నాన్ స్టిక్ ప్యాన్‌పై పిండి వేసిన తర్వాత అంటుకోకుండా దోశ రావడానికి ముఖ్య కారణం ఆ పెనం మీద ఉండే కోటింగ్.

ఆ కోటింగ్ టెఫ్లాన్‌ అనే ఒక రసాయన పదార్థంతో వేస్తారు. ఇలా కెమికల్స్ తో తయారైన నాన్ స్టిక్ ప్యాన్ వాడడం ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

ఇలాంటి ప్యాన్‌ వల్ల కిడ్నీ సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్యాన్ వేడి చేయడం వల్ల టెఫ్లాన్ కరిగి ఆహారంలో కలుస్తుంది. దాని వల్ల కెమికల్ మనిషి శరీరంలోకి వెళ్తుంది.

అదే ఇనుప పెనం మీద అయితే ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి ఇనుప పెనం మీద చేసిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.