రూ. 19 వేలకే అమెరికా-ఇండియా విమాన టికెట్..! షాకవుతున్న నెటిజన్లు
TV9 Telugu
22 March 2024
సాధారణ విమాన ప్రయాణానికి టికెట్ ధర వేలల్లో ఉంటుంది. ఖర్చు కారణంగా చాలామంది ఫ్లైట్ చేయడానికి ఆలోచిస్తారు.
ఒక్కోసారి సదరు ఎయిర్‌లైన్స్ అందించే క్రేజీ డీల్స్ ద్వారా భారీ డిస్కౌంట్ లభిస్తుంది.ఇప్పుడు అలంటి ఓ ఆఫర్ చూద్దాం..
వాషింగ్టన్ నుంచి ముంబైకి రూ. 50-90 వేలు ఖర్చు పెట్టాల్సిందే. కానీ నెట్‌లో ఓ క్రేజీ డీల్ దొరికినట్లు ఫాల్గుణ్ అనే యూజర్ ఎక్స్‌లో చెప్పుకొచ్చాడు.
కేవలం 19 వేలకే కనెక్టింగ్ ఫ్లైట్ ప్యాకేజ్ దక్కినట్లు స్క్రీన్‌షాట్లను షేర్ చేశాడు. ఈ నమ్మశక్యం కాని ధరలతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
దీంతో ఈ పోస్ట్‌ను 1.5 లక్షల మంది వీక్షించారు. ఏప్రిల్ 25న జర్నీ కోసం టికెట్స్ బుక్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఫాల్గుణ్ చెప్పాడు.
'వాషింగ్టన్ టు ముంబై ఫ్లైట్ ప్రయాణ ఖర్చు రూ. 19 వేలు. పేమెంట్ పేజ్ వరకు వెళ్లినట్లు, రెండు సాధారణ చెక్-ఇన్ బ్యాగేజీలను కూడా యాడ్ చేసినట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు.
ఇదెలా సాధ్యం అంటూ ఎదురు ప్రశ్నించాడు. వాషింగ్టన్ నుంచి ముంబై వెళ్లేందుకు అనేక ట్రావెల్ ఏజెన్సీల ఎకానమీ టిక్కెట్‌లను ఆ స్క్రీన్‌షాట్‌లో చూడవచ్చు.
ఫ్లైట్ నెట్‌వర్క్ రూ. 18,770, గోటోగేట్ రూ. 19,332 క్లియర్‌ట్రిప్ 19,815కే అందిస్తున్నాయి. వాషింగ్టన్ డుల్లస్ నుంచి టేకాఫ్ అయి వయా జెడ్డా ముంబై చేరుతుంది.