తొక్కే కదా అని తీసి పారేస్తున్నారా? ఎన్ని లాభాలో తెలుసుకోండి

19 September 2024

TV9 Telugu

TV9 Telugu

బరువు తగ్గాలన్నా.. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవలన్నా ఏకైక మార్గం కీరదోస. ఇందులో ఎన్నో ఉపయోగకరమైన పోషకాలు ఉన్నాయి. చాలా మంది కీరదోసను సలాడ్‌గా తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు

TV9 Telugu

కీరదోసలో సి, కె విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం. రోజూ తీసుకుంటే ఒంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది

TV9 Telugu

అయితే కీరదోస కంటే దాని తొక్క ఎక్కువ ప్రయోజనకరమైనదని మీకు తెలుసా? అవును.. కీరదోస తొక్కను పారేసే ముందు, ఆ తొక్క వల్ల కలిగే లాభాలేమిటో తెలుసుకోండి

TV9 Telugu

వేసవిలో మొటిమల సమస్య మరింతగా వేధిస్తుంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కీరదోస తొక్క మొటిమలతో పోరాడుతుంది. దీని తొక్కలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుంచి పునరుజ్జీవింపజేస్తాయి

TV9 Telugu

చర్మం తేమను పెంచడంలో కీరదోస తొక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కీరదోస తొక్కను మిక్సీలో గ్రైండ్ చేసి చర్మానికి అప్లై చేసి పది నిమిషాలు ఆగి కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది

TV9 Telugu

వేసవిలో అతిథులు ఇంటికి వస్తే చల్లని పానీయాలు సిద్ధం చేస్తుంటాం. ఆ పానీయం తాగడం ద్వారా ఉపశమనం పొందుతారు. వేడి వాతావరణంలో శీతల పానీయాలు అందించేటప్పుడు కొన్ని కీరదోస తొక్కలతో అందంగా అలంకరించవచ్చు

TV9 Telugu

ఇంటి పెరట్లో పెరిగే మొక్కలకు కీరదోస తొక్కలు బలేగా ఉపయోగపడతాయి. కీరదోస తొక్క అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. వీటిని మొక్కలకు ఎరువుగా వేస్తే వాటి మూలాలకు పోషకాలు అంది ఏపుగా పెరుగుతాయి

TV9 Telugu

కీరదోస తొక్క నేలలో వేగంగా కుళ్ళిపోతుంది. సారవంతమైన ఎరువుగా మారి మొక్కలకు మేలు చేస్తుంది. అయితే వీటిని ఎల్లప్పుడూ మొక్కల భాగంలో మాత్రమే వేయాలి