12 April 2024
TV9 Telugu
Pic credit - Pixabay
ఆసియాలో 7వేల ఏళ్లుగా తామర మొక్కను ఆహారంగా తీసుకుంటున్నారు. కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, విత్తనాలను కూడా వంటలో ఉపయోగిస్తారు
తామర పువ్వు, కాండం, విత్తనాలు, ఆకులు చాలా కాలంగా సాంప్రదాయ ఔషధాల తయారీలో ఉపయోగించబడుతున్నాయి. ఒత్తిడి ,టెన్షన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది
విరేచనాలు, ఇన్ఫెక్షన్, దగ్గు, అధిక రక్తపోటు, జ్వరం వంటి ఇతర వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది
తామర మొక్క అనేక ఫ్లేవనాయిడ్, ఆల్కలాయిడ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధి నుంచి రక్షిస్తుంది. కాలేయం దెబ్బతినకుండా నిరోధిస్తుంది
తేలికగా బరువు తగ్గాలనుకునే వారు తామరపువ్వులను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తామర పువ్వు వేర్లలో అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. దీనిలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది శరీర బరువును నియంత్రిస్తుంది.
తామర పువ్వుని చైనా సాంప్రదాయ వైద్యంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు.
లోటస్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి నొప్పి నివారిణిగా పనిచేస్థాయి. శరీరంలో ఎక్కడైనా నొప్పి కలిగి ఉంటే.. తామర నూనెతో మసాజ్ మంచి ఫలితాన్ని ఇస్తుంది
జుట్టు తెల్లబడటం, ఊడిపోవడం, పొడిబారడం వంటి సమస్యలకు తామర పువ్వు మంచి ఔషధం. ఈ పువ్వు నూనెను రోజూ తలకు మర్దన చేస్తే జుట్టు మెరుస్తూ, దృఢంగా పెరుగుతుంది.