టీవీ, రిఫ్రిజిరేటర్, టెలిఫోన్ , ATM అవిష్కరించింది ఒకే దేశంలో..
06 March 2024
ప్రపంచవ్యాప్తంగా అందరి నిత్య జీవితంలో టీవీ, రిఫ్రిజిరేటర్, టెలిఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు భాగమై పోయాయి.
టీవీ, రిఫ్రిజిరేటర్, టెలిఫోన్ , ATMలను ఎవరు సృష్టించారు, ఏ దేశానికి చెందిన వారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ఢిల్లీ జనాభా కంటే చిన్నదైన ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్తలే.. మనం ప్రతిరోజూ ఉపయోగించే ప్రతి వస్తువును తయారు చేసింది.
ఈ దేశం పేరు స్కాట్లాండ్. ఆ దేశం మొత్తం జనాభా 54 లక్షలు మాత్రమే. అయితే మేథో సంపత్తు ఎక్కువగా ఉన్న దేశం.
కొత్త ఆవిష్కరణలకు గానూ 16 నోబెల్ బహుమతులు అందుకుంది. ఇక్కడ ప్రజలు పని పట్ల చాలా మక్కువ కలిగి ఉన్నందునే అసాధారణులు అని కూడా అంటారు.
శస్త్రచికిత్స సమయంలో నొప్పిని నివారించడానికి, పెన్సిలిన్ అనే ఔషధం కూడా ఈ దేశ శాస్త్రవేత్త చేత తయారు చేయడం జరిగింది.
మొదటిసారిగా సైకిల్‌ను తయారు చేసిన దేశం కూడా స్కాట్లాండ్ కావడం. ప్రతి అవిష్కరణలో స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు ముందుంటారు.
కొత్త అవిష్కరణలు మాత్రమే కాదు, స్కాట్లాండ్ ఆర్థిక శాస్త్రాన్ని ప్రత్యేక సబ్జెక్ట్‌గా కూడా గుర్తించింది. దీనిపై పట్టు ఉన్నందున, ఈ దేశాన్ని ఆర్థిక వ్యవస్థ సింహంగా పిలుస్తారు.