6 August 2023

ఇలా చేస్తే తులసి మొక్క అస్సలు ఎండిపోదు..

Pic credit - Instagram

చాలా మంది తమ ఇళ్ల ముందు తులసి మొక్కను నాటి రోజూ పూజలు చేస్తుంటారు.

తులసి మొక్క సరిగా ఎదగకపోవడం, ఎండిపోవడం పెద్ద సమస్యగా భావిస్తారు.

అంతే కాకుండా తులసి మొక్క ఎండిపోతే ఇంటికి అశుభం అని ఒక నమ్మకం.

మీ ఇంట్లో తులసి మొక్కను బాగా పెంచడానికి ఈ చిట్కాలను పాటించండి.

ఎక్కువ నీరు పోయవద్దు. అధిక నీరు పోయడం వలన చెట్టు వేర్లకు తెగులు పడుతుంది.

మొక్కపై ఉదయం సూర్యరశ్మి సరిగ్గా పడే ప్రదేశంలో మొక్కను నాటాలి.

ప్రతి రెండు వారాలకోసారి తులసి మొక్కకు ఎరువులు వేయాలి.

ఆవు పేడ వేయాలి. మొక్క బాగా పెరగడానికి ఇది దోహదపడుతుంది.