సీనియర్ సిటిజన్లకు TTD శుభ వార్త

TV9 Telugu

17 January 2024

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటు చేసిన టీటీడీ.

ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు ద్వారా నేరుగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం.

అర్హత కలిగిన సీనియర్ సిటిజన్‌లు ఫోటో ID తో వయస్సు రుజువు పత్రాలను తిరుమలలో ఉన్న S1 కౌంటర్‌లో సమర్పించాలి.

వంతెన కింద ఉన్న గ్యాలరీ నుండి ఆలయం కుడి వైపు గోడ ద్వారా ఆలయంలోకి ఈ స్లాట్లు ద్వారా వృద్దులను అనుమతిస్తారు.

ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే, మంచి సీటింగ్ ఏర్పాటు అందుబాటులోకి తీసుకువచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం.

లోపల కూర్చున్న వృద్ధులకు వేడి సాంబార్ అన్నం, పెరుగన్నం, వేడి పాలు.. ప్రతిదీ ఉచితంగా అందించాలని టీటీడీ నిర్ణయం.

సీనియర్ సిటిజన్‌లు రూ.20 చెల్లించి రెండు లడ్డూలను పొందవచ్చు. మరిన్ని లడ్డూల కోసం మరో రూ.25 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి, కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి అందుబాటులోకి బ్యాటరీ కారు సదుపాయం.

దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేసినప్పటికీ, కేవలం సీనియర్ సిటిజన్ దర్శనం మాత్రమే అనుమతించడం జరుగుతుంది.

ఈ సదుపాయం వృద్దులు ఎక్కవ సమయం వేచి ఉండకూడ 30 నిమిషాల్లోపు శ్రీవారి దర్శించుకొని బయటకు రావచ్చు అంది టీటీడీ.