శీతాకాలంలో గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే..

25 December 2023

ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం.. ఏ కాలం అయినా ఎక్కువ బాధించేది గొంతు నొప్పి. ఇక చల్లని వాతావరణంలో ఏమైనా తాగాలన్నా, తినాలనిపించినా గొంతులో ముల్లు దిగినట్లు బాధ అనిపిస్తుంది

కొంతమందికైతే మాట్లాడటానికి కూడా గొంతునొప్పి ఆటంకం కలిగిస్తుంది. కరోనా పుణ్యమా అని దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు

గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ముందుగా గుర్తొచ్చేవి ఉప్పు, పసుపు. ఈ రెండూ గొప్ప పరిష్కార మార్గాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు 

గొంతు కొంచెం గరగరమంటుంటే ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూను పసుపు, అర టీ స్పూను ఉప్పు కలిపి నేరుగా గొంతులో కొండ నాలుకకు తగిలే విధంగా రెండు నిమిషాల పాటు పుక్కిలించాలి 

ఇలా తీవ్రతను బట్టి రోజూ చేయడం వల్ల త్వరితగతిన ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. గోరు వెచ్చని పాలలో కూడా పసుపును కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది

గొంతు నొప్పి ఉన్నప్పుడు మరీ వేడిగా ఉండే ఆహార పదార్థాలు కాకుండా గోరు వెచ్చని ద్రవ పదార్థాలు అయితే త్వరగా జీర్ణమై శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. వెజిటబుల్‌ సూప్స్‌కి ప్రాధాన్యాన్నిస్తే మంచిది

పులుపు లేని ఫ్రూట్‌ జ్యూస్‌లు, పాలు తీసుకోవడం వల్ల అటు మంచి పోషకాలతో పాటు శరీరానికి అవసరమైన నీటిని కూడా అందించవచ్చు.

త్వరితగతిన జీర్ణమై మంచి పోషకాలను పొందడానికి అరటిపండ్లు, ఓట్‌మీల్స్‌తోపాటు ఉడికించిన కూరగాయలు తినడం వల్ల కూడా కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది.