పగిలిన మడమలను మృదువుగా మార్చే చిట్కాలు

14 December 2023

చలికాలంలో చల్లని వాతావరణం వల్ల చర్మం త్వరగా పొడిబారుతుంది. ఈ కాలంలో చాలామందికి కాలి మడమల్లోనూ పగుళ్లు ఏర్పడుతుంటాయి

కొంతమందికి పగుళ్లు తీవ్రంగా మారి రక్తం కారడం, విపరీతమైన నొప్పి వంటివి వేధిస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంట్లోనే సహజసిద్ధమైన ప్యాక్స్‌ ట్రై చేయొచ్చంటున్నారు నిపుణులు

ముందుగా పిడికెడు వేపాకుల్ని తీసుకుని మెత్తటి ముద్దగా నూరుకోవాలి లేదంటే గ్రైండ్‌ చేసుకోవాలి. అందులో 3 టీస్పూన్ల పసుపు వేసి బాగా కలుపుకోవాలి

ఈ మిశ్రమాన్ని మడమలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో  పాదాలను శుభ్రం చేసుకుని శుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి

ఇలా క్రమంగా చేస్తే పగుళ్లు మాయం అవుతాయి. ఈ ప్యాక్‌ వేసుకున్న తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోకూదంటున్నారు నిపుణులు

ఒక టబ్‌లో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో నిమ్మరసం, ఉప్పు, గ్లిజరిన్‌, రోజ్‌వాటర్‌ ఒక్కో టీస్పూన్ చొప్పున వేసుకుని బాగా కలపాలి

ఈ నీళ్లలో పాదాలను ఉంచి 10 నుంచి 15 నిమిషాలు నాననిచ్చి, స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలను తొలగించుకోవాలి

ఆ తర్వాత కాస్త గ్లిజరిన్‌లో ఒక్కో టీస్పూన్ చొప్పున నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి మడమలకు రాసుకుని 15 నుంచి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి