ట్రావెల్ టూ సౌత్ ఇండియా.. వింటర్ బెస్ట్ ప్లేసులు ఇవే..
Prudvi Battula
Images: Pinterest
14 November 2025
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు వ్యాలీలో కాఫీ తోటలు, గుహలు, ఉత్సాహభరితమైన గిరిజన సంస్కృతిని ఆస్వాదించవచ్చు.
అరకు వ్యాలీ, ఆంధ్రప్రదేశ్
ఇది గొప్ప జీవవైవిధ్యాన్ని కలిగి తూర్పు కనుమలలో ఉన్న ప్రాంతం. ఇక్కడ అందమైన జలపాతాల్లో హాయిగా జలకాలు ఆడవచ్చు. ఇది కూడా అల్లూరి జిల్లాలోనే ఉంది.
మారేడుమిల్లి, ఆంధ్రప్రదేశ్
కేరళలోని మన్నార్ పర్యటనకు చాలా ప్రసిద్ధి. ప్రకృతి ప్రేమికులకు అనువైన ప్రదేశం. ఇక్కడ పచ్చని తేయాకు తోటలు, చల్లని వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.
మున్నార్, కేరళ
సుందరమైన బొమ్మ రైలులో ప్రయాణిస్తూ ఊటీలోని ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన తోటలను చూడవచ్చు. దీన్ని ఉదకమండలం అని కూడా అంటారు.
ఊటీ, తమిళనాడు
మరపురాని విహారయాత్ర కోసం కూర్గ్ బెస్ట్ ప్లేస్. సుందరమైన కాఫీ తోటలు, ఉత్కంఠభరితమైన జలపాతాలను వీక్షించవచ్చు.
కూర్గ్, కర్ణాటక
విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రదర్శిస్తూన్న హంపి పురాతన శిథిలాలు, చారిత్రాత్మక దేవాలయాలు ఆకట్టుకొనేలా ఉంటాయి.
హంపి, కర్ణాటక
ఇక్కడ నిర్మలమైన బీచ్‌లు, అద్భుతమైన కొండ చరియలతో పాటు ఆయుర్వేద వెల్‌నెస్ రిట్రీట్‌లలో విశ్రాంతి తీసుకోవచ్చు.
వర్కల, కేరళ
తమిళనాడులోని రామేశ్వరం పవిత్రమైన రామనాథస్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రశాంతమైన బీచ్‌లు విశ్రాంతికు బెస్ట్.
రామేశ్వరం, తమిళనాడు
మరిన్ని వెబ్ స్టోరీస్
7 డేస్.. 7 జ్యువెలరీ.. ఏ రోజు ఎలాంటి నగలు ధరించాలంటే.?
ఇంట్లో అందరు మెచ్చేలా.. టేస్టీ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఎలా చెయ్యాలంటే.?
కాటేసే ముందు పాములు హెచ్చరిస్తాయా.?