02 November 2023

UPI యాప్ ద్వారా రైలు టిక్కెట్ బుకింగ్

రైలు ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రవేశపెడుతోంది భారత రైల్వే శాఖ. ఆ బంపర్ ఆఫర్ ఏంటని ఆలోచిస్తున్నారా.

రైలులో ప్రయాణించే ప్రయాణికులు టిక్కెట్ల కోసం వేచి ఉండటం, లాంగ్ వెయిటింగ్ లిస్ట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Paytmలో రైలు టిక్కెట్ బుకింగ్ కోసం 'గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్' ఫీచర్‌ను ప్రారంభించింది రైల్వే శాఖ.

కొత్త ఫీచర్ సహాయంతో వినియోగదారులు రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు వారికి కావల్సిన సీటును పొందవచ్చు.

Paytmలో రైలు టిక్కెట్ బుకింగ్ సదుపాయం వినియోగదారులు తమకు ఇష్టమైన రైలులో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

ముందుగా Paytm యాప్‌లో మీ బయలుదేరాల్సిన స్టేషన్, చేరాల్సిన స్టేషన్ ఎంచుకుని.. టిక్కెట్‌ను నిర్ధారించుకోవల్సి ఉంటుంది.

Paytm అన్ని ప్రధాన విమానయానం, బస్ ఆపరేటర్లు, IRCTCతో ప్రయాణ బుకింగ్ చేసుకుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

రైలు టిక్కెట్ బుకింగ్‌లో వినియోగదారులు గేట్‌వే రుసుముగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. యాప్‌లో లైవ్ రైలు నడుస్తున్న స్థితి, PNR స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు.