చియా సీడ్స్‌ను ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా తినొద్దు

20 April 2024

TV9 Telugu

Pic credit - Pixabay 

చియా సీడ్స్ లో పోషకాకు మెండు. ఇందులో ఫైబర్, ఒమేగా -3 బి-కాంప్లెక్స్, విటమిన్ సి, ఇ , ఎ వంటి అనేక పోషకాలున్నాయి. 

చియా విత్తనాలు

చియా సీడ్స్ ను రోజూ తీసుకుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె, ఎముకలు, కండరాలు, చర్మం మొదలైన వాటికి ప్రయోజనాలను అందిస్తుంది.

చియా సీడ్స్ ప్రయోజనాలు

చియా విత్తనాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ..  కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకండి 

నష్టం కూడా సంభవించవచ్చు

జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు చియా గింజలను రోజూ తినకూడదు. లేకుంటే కడుపునొప్పి, వాపు, విరేచనాలు, తిమ్మిర్లు వంటి సమస్యలు రావచ్చు.

బలహీనమైన జీర్ణక్రియ

కొందరికి చియా గింజలంటే అలెర్జీ ఉండవచ్చు. వీటిని తిన్న తర్వాత దద్దుర్లు లేదా మరేదైనా సమస్య ఏర్పడితే వీటిని తినవద్దు.

అలెర్జీ సమస్య

BP పేషెంట్ అయితే  అధిక రక్తపోటును నియంత్రించడానికి మందులు తీసుకుంటుంటే, చియా విత్తనాలను తినవద్దు.

 రక్తపోటు

చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. కనుక లో షుగర్ ఉన్నవారు ఈ చియా సీడ్స్ ను తినరాదు. 

లో షుగర్ పేషెంట్స్

చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. కనుర వీటిని రోజు తింటే  రక్తస్రావ సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

రక్తస్రావ సమస్యలు