ఏటా ఇన్ని టన్నుల ఆహారం వృథా అవుతుందా..

18 October 2023

ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతుందో తెలుసా? ప్రతి ఏటా అక్టోబరు 16న ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ డేను జరుపుకుంటున్నాం.

సరైన ఆహారం , పోషకాహారాన్ని పొందడం మానవ ప్రాథమిక హక్కు. భూమ్మీద ప్రతి వ్యక్తికి పోషకాహారం లభించేలా అవగాహన పెరగాలి.

ప్రపంచంలోని కోట్లది మంది ప్రజలు సరైన పోషకాహారం లేక, పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేక నానా కష్టాలుపడుతున్నారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది. 150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించాయి.

2023 వరల్డ్‌ ఫుడ్‌ డే సందర్భంగా ధీమ్‌ ‘‘నీరే జీవితం, నీరే ఆహారం... ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి’’.

భూమిపై జీవించడానికి నీరు చాలా అవసరం. ఈ భూమిపై ఎక్కువ భాగం అలాగే మన శరీరాల్లో 60 శాతం పైగా నీరే ఉంటుంది.

అసలు ఈ ప్రపంచం ముందుకు సాగాలంటే నీరు లేకుండా సాధ్య పడుతుందా? అద్భుతమైన ఈ జీవజలాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.

అందుకే నీటిని ఎక్కువగా వృధా చేయకుండా పొదుపుగా వాడాలి. ఈ రోజు నుంచి నీటిని మనకి కావాల్సినంత మాత్రమే వాడుదాం.