మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే..
Prudvi Battula
Images: Pinterest
30 November 2025
దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు.
గుండె సమస్యలు
రక్తనాళాల్లో కోలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కోలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం
సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువే. ఇందులో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగు పరుస్తాయి.
చేపలు
పాలకూర, కొత్తమీర, ర్యాడిష్ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి.
పాలకూర, కొత్తమీర, ర్యాడిష్
ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఎంతో సహాయపడతాయి. రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.
గుండె పనితీరును మెరుగు పర్చడం
ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్టులో ఓట్స్ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే బీటా గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
ఓట్స్
గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్, ఐరన్, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్
దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.