చలికాలంలో హీటింగ్ బ్లోవర్‌లతో జరభద్రం..
TV9 Telugu
26 October 2024
అధిక చలి కారణంగా మీరు మీ గదిలో హీటింగ్ బ్లోవర్‌ను నడపవలసి వస్తుందా? అయితే జాగ్రత్త అంటున్నారు నిపుణులు.
నిరంతరంగా హీటింగ్ బ్లోవర్ నడుస్తుంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్యులు. కొన్నిసార్లు మీకు ఊపిరాడనంత పని అవుతుందంటున్నారు నిపుణులు.
మీరు ఎప్పుడూ కూడా మీ బెడ్ దగ్గర హీటింగ్ బ్లోవర్‌ని ఉంచకూడదు. కొన్ని గంటలపాటు హీటింగ్ బ్లోవర్ ఉపయోగించిన తర్వాత దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి.
హీటింగ్ బ్లోవర్‌ని గదిలో నిరంతరం నడుపుతూ ఉంటే గదిలోని తేమ పూర్తిగా నశించిపోతుందని చెబుతున్నారు నిపుణులు.
గదిలో తేమ తగ్గినట్లు అయితే చర్మ వ్యాధులు, అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. మంచి వెంటిలేషన్‌ను ఉన్నచోటనే హీటింగ్ బ్లోవర్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
కొన్ని గంటల పాటు హీటింగ్ బ్లోవర్ ఉపయోగించిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాలి. ఆపై నిద్రపోండి.
మీరు మీ గదిలో రాత్రంతా హీటింగ్ బ్లోవర్‌తో నిద్రిస్తే, అది గదిలో ఉండే ఆక్సిజన్‌ను తగ్గిస్తుందని అంటున్నారు.
నిపుణులు చెప్పిన ప్రకారం గదిలోని అదనపు కార్బన్ డయాక్సైడ్ కారణంగా శ్వాస తీసుకోవడంలో మీకు ఇబ్బంది కలగవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి