చదువుపై ఏకాగ్రత కుదరడం లేదా.? ఈ టిప్స్ మీకోసమే...
26 September 2023
సిలబస్ విషయంలో ఒక ప్లానింగ్‌తో ఉండాలి. గుడ్డిగా ఏది పడితే అది చదువుకుంటూ పోతే ఒత్తిడి పెరగడం తప్ప లాభం ఉండదు. కాబట్టి సిలబస్‌ను ఒక షెడ్యూల్‌లా చేసుకొని మార్కుల ఆధారంగా సబ్జెట్ చదువుకోవాలి.
చదువుపై ఏకాగ్రత పెరగాలంటే స్డడీ రూమ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే గదిలో మంచి సువాసన వెదజల్లే అగర్ బత్తీలను లేదా రూమ్ ఫ్రెష్‌నర్లను ఉపయోగించాలి.
ఇక స్టడీ రూమ్‌లో ఉండే కలర్స్ కూడా ఏకాగ్రతపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? అవును వీలైనంత వరకు లైట్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
ఇక కొందరు రాత్రంతా కూర్చుని చదువుతుంటారు. సిలబస్‌ను పూర్తి చేయాలన్న కారణంతో అదే పనిగా చదువుతుంటారు. అయితే సరిపడ నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గుతుందని గుర్తుంచుకోవాలి.
చాలా మంది ఉదయం లేవడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఉదయం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చదివిన అంశాలు గుర్తిండిపోతాయి.
ఏకాగ్రత పెరాగలంటే మనసును నియంత్రించుకునే శక్తి ఉండాలి. ఇందుకోసం యోగా, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవాలి. చదువుకునే ముందు కాసేపు మెడిటేషన్ చేయాలి.
చదువుకునే సమయంలో తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల ఎలాంటి డిస్ట్రబ్ లేకుండా చదువుకోవచ్చు.
కొందరు గంటల తరబడి చదువుతూనే ఉంటారు. అయితే మధ్య మధ్యలో విరామం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. కాసేపు బ్రేక్ తీసుకొని రిఫ్రెష్ అయ్యి మళ్లీ చదవడం మొదలుపెట్టాలి.