సతమతం చేసే సైనసైటిస్‌ నుంచి ఇలా ఉపశమనం పొందండి.. సింపుల్ హోం రెమెడీ

24 November 2023

తరచూ ముక్కులు మూసుకుపోవటం, శ్వాస తీసుకోవడంలో కష్టంగా మారడం సైనసైటిస్‌ లో కనిపించే ప్రధాన సమస్యలు. 

వైరస్, బాక్టీరియా, ఫంగస్‌ కారణంగా వచ్చే సైనస్‌ వ్యాధి వల్ల ముక్కుతోపాటు గొంతు సంబంధిత సమస్యలు, తలనొప్పి ఇబ్బందిపెడుతుంటాయి.

ఉల్లి, వెల్లుల్లి రేకులను తింటే సైనసైటిస్‌ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది.

మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్‌ వంటి ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.

టీ స్పూన్‌ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్‌ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి.

సైనస్ సమస్య ఉన్నవారు ఎప్పుడూ వేడి నీటిని తాగాలి. అలాగే, అర చెంచా యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి తాగినా సైనస్ నుంచి ఉపశమనం కలుగుతుందట.

అల్లంతో తయారుచేసిన డికాషన్ తీసుకోవడం వల్ల సైనస్ సమస్యలు నయమవుతాయి. సైనోసిస్‌తో బాధపడేవారు పుదీనా ఆకులను నీటిలో బాగా మరిగించి ఆవిరి రూపంలో తీసుకోవాలి.

250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్‌ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగుసార్లు తీసుకోవాలి. 300 మిల్లీ లీటర్ల క్యారట్‌ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒకసారి తాగాలి.