కిచెన్ చిమ్నీని ఎలా శుభ్రం చేయాలి?

01 April 2024

TV9 Telugu

ఇంట్లో కిచెన్‌లో వంట చేసేటప్పుడు వచ్చే వేడి, పొగ బయటకు పంపించి.. ఆ గదిని చల్లగా ఉంచేందే కిచెన్ చిమ్నీ.

చిమ్నీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటేనే వంటగదితో పాటు ఆరోగ్యం బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వంట చేసే క్రమంలో వెలువడే పొగతో పాటు ఆయిల్ మరకలు తోడై చిమ్నీ జిడ్డుగా మారిపోతుంది. వంటగదిలోని గాలిని పొగ, ధూళి, వాసనలు లేకుండా.. చిమ్ని పరిసరాలను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.

వంటగదిలో పేరుకుపోయే దుమ్ము, ధూళి కారణంగా చిమ్నీ ప్రభావితం కావడంతో పాటు వాయు కాలుష్యానికి దారి తీస్తుంది.

ఆటో క్లీన్ చిమ్నీలు చాలా వరకు స్వయంగా శుభ్రపరుస్తున్నప్పటికీ, సాధారణ నిర్వహణను నిర్వహించడం చాలా ముఖ్యం. తేలికపాటి డిటర్జెంట్, మృదువైన క్లాత్ ఉపయోగించి చిమ్నీని శుభ్రం చేయాలి.

వంట చేసేటప్పుడు, అధిక వేడి, పొగ వెలువడకుండా చూసుకోవాలి. అధిక వేడి చిమ్నీ ఫిల్టర్లను దెబ్బ తీస్తుంటాయి. గ్లెన్ నిపుణులు సిఫార్సు చేసిన విధంగా రెగ్యులర్ సర్వీసింగ్, షెడ్యూల్ ప్రకారం నిర్వహణ తప్పనిసరి.

శుభ్రపరిచే ముందు చిమ్నీకి విద్యుత్ సరఫరా చేసుకుండా చూసుకోవాలి. చిమ్నీని, ఫిల్టర్‌లను దెబ్బతీసే కఠినమైన రసాయనాలు ఉపయోగించకూడదు.

వంట చేసే ప్రదేశం శుభ్రం చేయడం ద్వారా వంటగదిలో శుభ్రత పాటించాలి. చిమ్నీ శుభ్రపరిచే సమయంలో నీటి సంబంధించి తయారీదారు సూచనలను పాటించాలి.