కల్తీ పాలు ఈజీగా కనిపెట్టేయొచ్చు!

25 December 2023

TV9 Telugu

పాలను వేడి చేయడం ద్వారా అవి కల్తీ పాలా.. స్వచ్ఛమైన పాలా అనేది తెలుసుకోవచ్చని బెంగళూరు ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

పాలను వేడి చేసినప్పుడు అవి ఆవిరయ్యే తీరు ఆధారంగా వాటిలో ఎంతవరకు నీళ్లు లేదా యూరియా కలిసిందో తెలుసుకోవచ్చనని వెల్లడించింది.

మీరు తీసుకొచ్చే పాలలో ఏదైనా సింథటిక్ ఉంటే పాల వాసనను గుర్తించడం చాలా సులభం అంటున్నారు పోషకాహార నిపుణులు.

పాలు మరుగుతున్నప్పుడు దాని వాసన మెల్లగా మొదలవుతుంది. సింథటిక్ పాలను దాని చెడు రుచి, వాసన ద్వారా సులభంగా గుర్తించవచ్చు.

అదెలా అంటే.. స్వచ్ఛమైన పాలను వేడి చేసినప్పుడు పాల మధ్యలో బుడగలా వస్తుంది. అక్కడే మరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

అదే కల్తీ పాలను వేడి చేసినప్పుడు మాత్రం ఈ ప్రక్రియ స్థిరంగా ఉండదు. ఇది మారుతూ ఉంటె మాత్రం అవి కల్తీ పాలని గురించాలి.

మృదువైన ఉపరితలంపై 2-3 చుక్కల పాలను వేయండి. అది మెల్లగా ఏదో ఒకవైపుకు పారుతుంది. అలా పాలు పారిన దారిలో తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలే.

అదే కల్తీ పాలు అయితే మాత్రం వీటికి బిన్నంగా వేగంగా పారుతాయి. పారిన దారిలో తెల్లగా రాకుంటే అవి కల్తీ పాలు.