క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించేందుకు చిట్కాలు..

24 December 2023

TV9 Telugu

క్రిస్మస్ వస్తుందంటే చాలు.. నలుగురు కలిస్తే క్రిస్మస్ ట్రీ డెకరేషన్‌ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు.

ట్రీని కలర్‌ఫుల్ లైట్స్, బబుల్స్‌తో డెకరేట్ చేస్తారు. కొంతమంది స్టార్స్, పూలు, క్యాండిల్స్ ఇలాంటి వాటితో అలంకరిస్తారు.

డెకరేట్ చేసే ఐటెమ్స్, లైట్స్, బల్బ్స్, ఇతర వస్తువులు అన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్‌వి తీసుకుని సెటప్ చేయొచ్చు.

ఇవి మన్నిక ఎక్కువగా ఉండేవి అయితే వాటిని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. రెడ్, గోల్డ్ ఇలా ముందుగా ఓ కలర్ థీమ్‌ని ఎంచుకోండి.

అదే విధంగా చల్లని అనుభూతి కోసం మంచుతో నిండిన ఫీల్ కోసం బ్లూ, సిల్వర్ రంగు ఎంచుకోవచ్చు. అయితే ఎక్కువ కలర్స్ వాడకండి.

క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చేసేటప్పుడు మీకు ఇష్టమైన విధంగా స్టార్స్, లైట్స్, బెలూన్స్‌తో డెకరేట్‌ చేయవచ్చు.

క్రిస్మస్ ట్రీని డెకరేషన్ చేయడం కోసం లైటింగ్‌ కోసం చేంజేబుల్ కలర్‌ లైట్స్ ఎంచుకుంటే చూడటానికి బాగుంటాయి.

అక్కడక్కడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేయొచ్చు. అదే విధంగా గిఫ్ట్ బాక్స్‌లు కూడా పెడితే క్రిస్మస్‌ ట్రీ లుక్‌ అదిరిపోతుంది.