కుక్కర్ నుంచి లీకేజ్ కాకుండా చిట్కాలు.. 

TV9 Telugu

20 July 2024

ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా కుక్కర్ ఉపయోగిస్తూ ఉంటారు. మటన్ లాంటివి కూడా కుక్కర్ లో వేస్తే 6, 7 విజిల్స్‌కి ఉడికిపోతుంది.

చాలా మంది కొలవకుండానే వాటర్ పోయడం వల్ల నీరు ఎక్కువ అవుతుంది. ఈ నీటిని కుక్కర్ విజిల్ ద్వారా ఒక్కటే సారి పంపిస్తుంది.

దీని వల్ల ఫుడ్ మాడిపోవడం, కుక్కర్ విజిల్ పాడవ్వడం జరుగుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. ముందు సరైన మొత్తంలోనే నీటిని వేయండి.

మీరు నీటిని ఎక్కువగా పోసారని మీకు అనిపిస్తే.. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టకండి. దీని వల్ల ఒక్కటేసారి వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి.

మీడియం మంటలో ఓ రెండు, మూడు విజిల్స్ తెప్పిస్తే సరిపోతుంది. అలాగే మొదటి విజిల్ నుంచి వాటర్ ఎక్కువగా వచ్చాయంటే.. వెంటనే మంటను సిమ్‌లో పెట్టండి.

చాలామంది ప్రజలు అలవాటులో పొరపాటులాగా ఒక్కోసారి కుక్కర్‌కి ఉండే రబ్బర్ సరిగా పెట్టకుండానే మూతపెడుతూ ఉంటారు.

కాబట్టి కుక్కర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకోవాలి. రబ్బర్ సరిగా లేకపోయినా కూడా వాటర్ లీక్ అవుతుంది.

చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. కుక్కర్ క్లీన్ చేస్తారు. కానీ విజిల్ క్లీన్ చేయరు. విజిల్ సరిగా క్లీన్ చేయక పోవడం వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు.