TV9 Telugu
23 March 2024
40 తర్వాత ఇలా చేస్తే
గుండె పదిలం..
సాధారణంగా 40 ఏళ్లు నిండగానే చాలా మంది వ్యాయామాన్ని వదిలేస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో వ్యాయామాన్ని వదలకూడదని చెబుతున్నారు.
పాల ఉత్పత్తులను వీలైనంత వరకు తగ్గించాలి. ముఖ్యంగా చీజ్, నెయ్యి వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కేలరీలు తక్కువగా ఉండే ఈ ఆహారంతో గుండె పదిలంగా ఉంటుంది.
గింజలు, మొలకలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్‌ను డైట్‌లో భాగం చేసుకోవాలి. వీటి వల్ల గుండె పదిలంగా ఉంటుంది.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పులును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
40 ఏళ్లు దాటిన వారు రాత్రి వీలైనంత వరకు త్వరగా తినేయాలి. తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే వాకింగ్‌ను కచ్చితంగా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. రోజులో కనీసం 30 నిమిషాలైనా వాకింగ్ చేయాలని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..