రోజంతా అలసటగా ఉంటోందా.? 

22 September 2023

పెద్దగా శారీరక శ్రమలేకపోయినా కొందరు ఇట్టే అలసిపోతుంటారు. రోజంతా నిస్సత్తువతో ఉంటారు. చిన్న పనికే అలసిపోతుంటారు. 

ఇలా ఏ పని చేయకపోయినా అలసిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో కొన్ని విటమిన్ల లోపమైతే మరికొన్ని హార్మోన్ల లోపం కూడా కావొచ్చు.

శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి నిత్యం హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. నిమ్మరసం, నీటిని, కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. 

శరీరంలో విటమిన్‌ బీ లోపం ఉన్నా విసుగు, ఆందోళనలాంటివి వేధిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలున్న వారు గుడ్లు, ఉత్పత్తులు, పప్పులు, బీన్స్‌ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. 

నిత్యం అలసిపోయినట్లు, నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది. థైరాయిడ్ హార్మోన్‌ అసమతుల్యత ఉన్నా ఇలాంటి లక్షణాలలు కనిపిస్తాయి. 

పగటిపూట మరీ అలసట అనిపిస్తే కాసేపు కునుకు తీయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పావుగంట రిలాక్స్‌ అవుతే శరీరం మళ్లీ రీఛార్జ్‌ అవుతుంది.

నిత్యం నిస్సత్తువతో ఉంటే శరీరానికి కావాల్సిన కొవ్వులు అందడం లేదని అర్థం. ఇలాంటి వాళ్లు అవిసె గింజల, గుమ్మడి గింజలు, వాల్‌నట్స్‌ వంటివి తీసుకోవాలి

రోగ నిరోధక శక్తి తగ్గినా.. అలసట, నిస్సత్తువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే ప్రోటీన్‌లను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.