చలికాలం ఎముకలు ఇలా పదిలం..

21 January 2024

TV9 Telugu

సాధారణంగా చలికాలంలో ఎముక‌లు, కీళ్లు గ‌ట్టిగా మారి నొప్పుల‌కు దారి తీస్తుంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

చలికాలంలో ఎముక‌ల బ‌లోపేతానికి రోజూ క‌నీసం అర‌గంట పాటు కచ్చితంగా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

వాకింగ్, రన్నింగ్, జాగింగ్‌, డ్యాన్సింగ్‌.. కనీసం మెట్లు ఎక్కడం లాంటివి అయినా చేస్తూ ఉండాలి. స్విమ్మింగ్‌ కూడా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు

ఇక వింటర్‌లో యోగాను అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సూర్య నమస్కారం లాంటివి అలవాటు చేసుకుంటే ఎముకలు ధృడంగా మారుతాయి.

అయితే వర్కవుట్స్‌ చేసే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి ఎక్కువ సమయం కాకుండా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి.

వింటర్‌లో ఎముకల ఆరోగ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణాల్లో విటమిన్‌ డీ లోపం కూడా ఒకటి. రోజులో కాసేపు సూర్యరక్ష్మి పడేలా చూసుకోవాలి. 

క్యాల్షియం అధికంగా ఉండే పాలు, పాల పదార్థాలతో పాటు.. కాయ‌గూర‌లు, ఆకుకూర‌లు, క్యాల్షియం పోర్టిఫైడ్ ఆహారాల‌ను తీసుకోవాలి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.