హాయిగా నిద్రపోవాలంటే.. ఇలా చేయండి!

Jyothi Gadda

03 June 2024

ప్రస్తుతం బిజీ లైఫ్‌లో చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిద్రలేమి కారణంగా దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరానికి హాని.

సాధారణంగా ఎనిమిది గంటల పాటు ద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  కానీ  చాలా మంది ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీని వల్ల కలిగే నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

నిద్రలేమితో గుండెకు సంబంధించిన జబ్బులు, ఊబకాయం, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి ప్రమాదరకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమస్య కామన్ అంటూ తీసిపారేయకూడదు. 

పనిలో ఒత్తిడి వల్లనో లేకపోతే డిప్రెషన్ వల్లో లేదా మరెదైనా కారణంగానో కానీ నిద్రించే టైం పూర్తిగా తగ్గిపోయింది. కంటి నిండా నిద్రలేకపోవడం వల్ల పనిలో ఏకాగ్రత చూపలేరు. హాయిగా పడుకోవాలంటే ఈ టిప్స్ ను పాలో అవ్వాల్సిందే.. 

ప్రతి ఒక్కరూ నిద్రకు సమయం కేటాయించాలి. ఈ సమయానికే పడుకోవాలని ముందే నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా నిద్రొచ్చే వరకు ఫోన్ చూస్తూ ఉంటానని అనుకోకూడదు. దీనివల్ల మీ నిద్రపోతుంది. ఇక పడుకునే ముందు లైట్ ఆఫ్ చేయండి. 

తిన్న ఒక గంట తర్వాత పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. నైట్ ఎంత తొందరగా పడుకుంటే పొద్దున్న అంత తొందరగా నిద్రలేస్తారు. దీంతో మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ పనిని  పర్ఫెక్ట్ గా చేస్తారు. 

మన ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ , యాంగ్జైటీ వంటివి మన నిద్రకు బంగం కలిగిస్తాయి. అంతేకాదు ఈ ప్రాబ్లమ్స్ యే నిద్రలేమి సమస్యకు కారణమవుతాయి. వీటిని బయటపడాలంటే ప్రతిరోజూ కొంత సమయం పాటు వ్యాయామం చేయాలి. 

రాత్రి పూట అతిగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నచ్చిన ఫుడ్ ఐటెమ్స్ తో మీ కడుపును నింపితే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్కహాల్, స్వీట్స్, కెఫిన్ ను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.