ఇష్టమున్నా లేకున్నా ఒక్కోసారి కళ్లద్దాలు తప్పక వాడవల్సి ఉంటుంది. కళ్లజోడు ఎక్కువగా వాడటం వల్ల కళ్ల చుట్టూ, ముక్కుపై మచ్చలు ఏర్పడుతుంటాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం
కీరా దోశ ముక్కతో మచ్చలున్న చోట రుద్దుకోవచ్చు
కీరా రసంలో బంగాళాదుంప, టమాటా రసం కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రాసినా ఫలితం ఉంటుంది
ఈ మిశ్రమాన్ని ఆప్లై చేసిన తర్వాత ఆరనిచ్చి చల్లని నీళ్లతో కడిగేసుకుంటే సరి
కలబంద గుజ్జు మచ్చలను తొలగించడంతో చక్కగా పనిచేస్తుంది
మచ్చలున్న చోట కలబంద గుజ్జుని అప్లై చేస్తే సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు
నారింజ తొక్కల పొడిలో పాలు, పెరుగు, బంగాళాదుంప, టమాటా వేసి బాగా కలుపుకోవాలి
ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట అప్లై చేసినా మచ్చలు తగ్గుతాయి