ఆహారంలోని పోషక విలువలు పాడైతే అవి ఆరోగ్యానిక మేలుకంటే కీడు ఎక్కువ తలపెడతాయి. మెడికల్ షాపుల్లో మందుల మాదిరి అన్ని ఆహారాలకు గడువు తేదీ ఉంటుంది. సాధారణంగా ఆహారాలు చెడిపోతే కుళ్ళిపోతాయి
TV9 Telugu
కానీ ప్రాసెస్ చేసిన ఆహారం కుళ్ళిపోకపోయినా, దాని గడువు తేదీబట్టి గుర్తించవచ్చు. కానీ ఎప్పటెప్పటికీ కొన్ని ఆహారాలు ఉన్నాయి. అంటే వీటికి ఎక్స్‌పైరీ డేట్ అస్సలు ఉండదన్నమాట
TV9 Telugu
వాటిల్లో మొదటిది తేనె. తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చర్మం, పెదాల సంరక్షణకు ఇది దివ్వౌషధం. దీనిని సరిగ్గా నిల్వ ఉంచినట్లయితే, ఎంతకాలమైన దాని పోషక విలువల్లో ఎటువంటి మార్పు ఉండదు
TV9 Telugu
బియ్యం కూడా సరిగ్గా నిల్వ చేస్తే ఎంత కాలం పాటైనా పోషక విలువలు చెడిపోకుండా ఉంటాయి. బియ్యాన్ని మంచి వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో భద్రపరిచస్తే చెడిపోవు. అయితే, బ్రౌన్ రైస్ నిల్వ ఉండవు
TV9 Telugu
ఉప్పు కూడా ఎన్నాళ్లైనా చెడిపోకుండా ఉంటుంది. అయితే ఉప్పును ఉంచే కంటైనర్‌లో గాలి లేకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే ఉప్పు తాజాగా ఉంటుంది
TV9 Telugu
షుగర్ కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. చక్కెరను ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. ఇందులో బ్యాక్టీరియా వంటివి పెరుగవు. కానీ తడి లేకుండా చూసుకోవాలి. అంటే చక్కెర పొడిగా ఉంటే ఎన్నాళ్లైనా నిల్వ చేసుకోవచ్చు
TV9 Telugu
సెసర పప్పు, కంది పప్పు, రాజ్మా వంటి ఎండు ధాన్యాలు దాదాపు ప్రతి వంటగదిలో కనిపిస్తాయి. బియ్యం మాదిరిగానే పప్పులు కూడా త్వరగా పాడవవు. చాలా నెలలపాటు నిల్వ చేయవచ్చు
TV9 Telugu
పాత వైన్ రుచి చెప్పనక్కరలేదు. పాత వైన్లకు డిమాండ్ బలేగా ఉంటుంది. వైన్‌కు కూడా గడువు తేదీ ఉండదు. కాబట్టి దీన్ని ఎంత ఎక్కువకాలం నిల్వ చేస్తే దాని రుచి అంత పెరుగుతుంది. ఎన్నైనా కొనుగోలు చేసి, ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు