TV9 Telugu

14 May 2024

పైల్స్ వేధిస్తున్నాయా.? ఈ ఫుడ్‌ జోలికి వెళ్లకండి 

పైల్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు స్సైపీ ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పేగు కదలికల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

ఇక డీప్‌ ఫ్రైడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటిలో తక్కువ పోషకాలు, ఎక్కువగా ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవే జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

పైల్స్ సమస్యతో బాధపడే వారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్‌ కారణంగా పోషకాలను తగ్గించడం ద్వారా జీర్ణ సమతుల్యతను దెబ్బతీయడమే కాకుండా ప్రేగు కదలికపై ప్రభావం చూపుతుంది.

పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కడుపులో తిమ్మిరికి, మలబద్ధకానికి దారితీస్తాయి.

ప్యాకేజీ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకున్నా పైల్స్‌ సమస్య వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిప్స్‌ వంటి ఆహారాన్ని తీసుకుంటే పైల్స్‌ నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

అధిక ఫైబర్‌ కంటెంట్‌ ఉన్న ఫుడ్‌ తీసుకున్న ఇబ్బందేనని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఫైబర్‌ పైల్స్‌ తగ్గడానికి ఉపయోగపడినా, అధికంగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.

ఇక తెల్ల రొట్టె, పాస్తాతో పాటు మైదా పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల కూడా  జీర్ణక్రియ మందగించి, పైల్స్ వేధిస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.