TV9 Telugu

19 April 2024

మైగ్రేన్‌ వేధిస్తోందా.?  ఇవి తినకండి.. 

వైన్‌ తాగేవారిలో 77 శాతం మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. డీ హైడ్రేషన్‌ కారణంగా ఈ సమస్య వస్తుందని గుర్తించారు. 

తలనొప్పి వస్తే కాఫీ తాగితే తగ్గుతుందని అనుకుంటాం. అయితే అదే కాఫీ తలనొప్పి పెరగడానికి కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇక చాక్లెట్ కూడా మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్‌లో కెఫిన్‌తో పాటు మైగ్రేన్ నొప్పిని పెంచే బీటా-ఫెనిలేథైలమైన్ అనే రసాయనం ఉంటుంది.

మార్కెట్లో లభించే ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్‌ కూడా మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపిస్తుందని నిపుణులు అంటున్నారు. మైగ్రేన్‌ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. 

ప్రాసెస్డ్‌ మీట్ తీసుకున్నా కూడా మైగ్రేన్‌ తలనొప్పి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌ కూడా మైగ్రేన్‌ను పెంచుతుందని అంటున్నారు.

చీజ్‌ కూడా తలనొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చీజ్‌లోని టైరమైన్ అనే పదార్ధం తలనొప్పిని పెంచుతుంది.

ఉప్పు అధికంగా ఆహారాలను ఎక్కువగా తీసుకున్న తలనొప్పికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సోడియం మైగ్రేన్‌కు కారణమవుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.