కిడ్నీ సమస్యలున్నాయా.? ఇవి తినొద్దు.. 

24 october 2023

కిడ్నీ సమస్యతో బాధపడేవారు పచ్చళ్లకు దూరంగా ఉండాలి. పచ్చళ్లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇక ప్రాసెస్ చేసిన నాన్‌ వెజ్‌ తీసుకోకూడదు. ఇందులో ప్రిజర్వేటివ్‌లు, లవణాలు ఎక్కువగా ఉంటాయి. రుచిని పెంచడానికి ఉపయోగించే వీటి కారణంగా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. 

కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు అరటి పండ్లకు దూరంగా ఉండాలి. ఇందులోని పొటాషియం కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

 బంగాళ దుంపల్లో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది. అధికంగా పొటాషియం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు

కిడ్నీ వ్యాధులతో ఇబ్బంది పడే వారు కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఇందులోని ఫాస్పేట్‌ మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి. 

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును వీలైనంత వరకు తగ్గించాలి. ఉప్పు రక్కపోటును మాత్రమే కాకుండా మూత్ర పిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. 

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి ఆక్సలేట్‌లు కారణంగా చెప్పొచ్చు. కాబట్టి ఇవి అధికంగా ఉండే పాలకూరకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 

కిడ్నీ సమస్యలతో బాధపడే వారు వీలైనంత నీటిని తాగుతూ, మంచి ఆహార పద్ధతులు పాటించడం ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు.