ఇలా చేస్తే పచ్చి కొబ్బరి 8 నెలలైనా పాడవదు..

16 August 2024

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యం, బలం, జ్ఞాపకశక్తిని అందించే పదార్థాల్లో కొబ్బరి ఒకటి. ముఖ్యంగా శాఖాహారం,  మాంసాహార వంట ఏదైనా తప్పనిసరిగా కొబ్బరిని ఉపయోగిస్తుంటారు గృహిణులు

TV9 Telugu

కొబ్బరితో వివిధ రకాల రుచికరమైన ఆహారాన్ని తయారు చేయవచ్చు. కొబ్బరికాయను వంటకే కాదు ఆరోగ్యానికి బోలెడు లాభాలున్నాయి. కానీ వచ్చిన చిక్కేంటంటే పచ్చి కొబ్బరి ఎక్కువ కాలం నిల్వ చేయలేం. అది త్వరగా పాడైపోతుంది

TV9 Telugu

అయితే ఈ టిప్స్‌ పాటిస్తే పచ్చి కొబ్బరి 8 నెలలైనా పాడవకుండా తాజాగా ఉంటుంది. ఇథిలీన్ ఉన్న పండ్లతో కొబ్బరికాయలను ఉంచితే అవి త్వరగా పాడవుతాయి. అందుకే వీటిని పొడి ప్రదేశాల్లో మత్రమే ఉంచాలి 

TV9 Telugu

కొబ్బరి నీళ్లు అధిక సమయం తాజాగా ఉండాలంటే వడకట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. 24-48 గంటలు బాగానే ఉంటాయి. అలాగే ఐస్ ట్రేలో ఉంచితే కొబ్బరి నీళ్లు 6 నెలలైనా పాడవవు

TV9 Telugu

కొబ్బరికాయ పగులగొట్టిన తరువాత, షెల్ తొలగించి, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచినా పాడవకుండా ఉంటాయి

TV9 Telugu

కొబ్బరిని ముక్కలుగా కోసి బాగా ఎండబెట్టాలి. వీటిని గాలి చొరబడని కంటైనర్‌తో ఉంచి ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు. తేమ తగలకుండా ఉంచితే కొబ్బరి 6-8 నెలల వరకు తాజాగా ఉంటుంది 

TV9 Telugu

అయితే రిఫ్రిజిరేటర్‌లో ఉంచే ముందు కొబ్బరిపై తేదీని తప్పనిసరిగా రాసి ఉంచుకోవాలి. ఎందుకంటే కొబ్బరిని నెలల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి, వంటలకు వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి

TV9 Telugu

కొబ్బరిలో పీచు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాపర్‌ లాంటి ఖనిజాలు దండిగా ఉంటాయి. కొబ్బరిని తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి