చలికాలంలో గడియారాలను ఒక గంట వెనక్కి తిప్పే దేశం ఇదే!
TV9 Telugu
30 December 2024
అమెరికా ప్రజాలు చలికాలంలో తమ గడియారాన్ని ఒక గంట వెనక్కి తిప్పుతారు. నిజానికి దీని వెనుక ఓ కారణం ఉంది.
ప్రజలు పగటి వెలుతురును గరిష్టంగా ఉపయోగించుకునేలా ఇది జరుగుతుంది. దీనిని డేలైట్ సేవింగ్ అంటారు. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్ నెలలో నిర్వహిస్తారు.
అయితే ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంప్రదాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడి.
ప్రపంచంలోని అనేక దేశాలలో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ పగలు చాలా తక్కువగా ఉంటాయి. రాత్రులు చాలా పొడవుగా ఉంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలయాలు, దుకాణాలు తదితర ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం చాల ఎక్కువగా ఉంటుంది.
గడియారాన్ని ఒక గంట వెనక్కి తిప్పడం ద్వారా, కార్యాలయాలు త్వరగా మూసేసి, ప్రజలు ఇంటికి వెళతారు. దీంతో తక్కువ విద్యుత్తు వినియోగం అవుతుందని నమ్మకం.
అలాగే ప్రజలు పగటి వెలుతురును ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు. దీనికి చాలా ప్రతికూలతలు కూడా ఉన్నాయి. దీని కారణంగా ఈ సంప్రదాయాన్ని నిలిపివేయాలని డిమాండ్లు ఉన్నాయి .
గడియారాలను పదేపదే ముందుకు వెనుకకు తరలించడం చాలా ఖరీదైనదని ట్రంప్ పార్టీ రిపబ్లికన్ నేతలు వాదించారు. దీని వల్ల అమెరికాకు నష్టం వాటిల్లుతుందని ట్రంప్ అన్నారు.
నిపుణులు డేలైట్ సేవింగ్ సమయం ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు. దీని వల్ల శరీరం చాలా సర్దుకుపోవాల్సి వస్తుంది.
ఈ నియమం కారణంగా, ప్రజలలో ఒత్తిడి, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చాలాసార్లు విసిగిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.