డైటింగ్ పేరుతోనో మరే కారణంతోనే ఆహారాన్ని తీసుకోవడం ఆపకూడదు. ఎక్కువసేపు ఫుడ్ తీసుకోకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి నీరసం ఆవహిస్తుంది. ఆలోచన తీరుపై ప్రభావం పడుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల మెదడు ఆరోగ్యం మెరుగువుతుంది. మెదడు పనితీరు బాగా పనిచేస్తుంది.
బ్రెడ్ వంటి పాలిష్ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో గ్లూకోజు హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఇది మూవ్ స్వింగ్స్‌కు దారి తీస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడమే మంచిది.
ఇక తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో తినడం కాకుండా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తినే ప్రయత్నం చేయాలి. దీంతో రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉంటాయి.
శరీంలో నీటి శాతం తగ్గిన ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే శరీరంలో నీటిశాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు తాగడం మానుకోవద్దు.
కాఫీ తాగితే చురుకుదనం పెరుగుతుందని తెలిసిందే. అయితే కాసేపు హుషారుగా ఉన్నా మరీ ఉక్కువగా తీసుకుంటే మాత్రం నిద్రకు భంగం కలిగి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
వీలైనంత వరకు ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటే మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషాయలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడడమే ఉత్తమం.