సూర్యగ్రహణం సమయంలో చేయకూడని పనులు..!

TV9 Telugu 

02 October 2024

సర్వ పితృ అమావాస్య రోజున ఏడాది రెండవ సూర్యగ్రహణం వస్తుంది. ఈసారి అక్టోబర్ 2 రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3.17 గంటల వరకు ఉంటుంది.

ఈసారి ఏర్పడే సూర్య గ్రహణం "రింగ్ ఆఫ్ ఫైర్" గ్రహణమంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం.

సూర్యగ్రహణానికి కొన్ని గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో తినడం, త్రాగడం, నిద్రించడం, స్నానం చేయడం మంచికాదంటున్నారు.

సూర్యగ్రహణం సమయంలో చాలా బ్యాక్టీరియా వాతావరణంలో చురుకుగా మారుతుందంటారు. గ్రహణ కాలం తర్వాత మాత్రమే స్నానం చేయాలి. ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది.

గ్రహణ సమయంలో భుజించడం, త్రాగడం వంటివి చేయడం వల్ల మనిషి అన్ని పుణ్యాలు నశిస్తాయి అని స్కందపురాణంలో పేర్కొన్నారు.

సూర్యగ్రహణం సమయంలో సూర్యుని నుండి వెలువడే కిరణాలు కారణంగా ఆహారం విషపూరితం అవుతుంది. ఇలాంటి వాటివల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు వస్తాయి.

పురాతన నమ్మకాల ప్రకారం, గ్రహణం సమయంలో నిద్రపోవడం వల్ల నీరసం, సోమరితనం, శరీరంలోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.

గ్రహణం సంభవించబోతున్నప్పుడల్లా తులసి ఆకులను ఆహార పదార్థాలలో చేర్చి ముగిసిన తర్వాత, వాటిని తీసివేయడం వల్ల ఆహారం అపరిశుభ్రంగా మారదని నమ్ముతారు.