దక్షిణ భారతంలో ఈ జలపాతాలు ప్రకృతి అందాలకు బర్త్ ప్లేస్.. పక్కా చూడాలి
Prudvi Battula
Images: Pinterest
03 December 2025
తమిళనాడులోని తలైయార్ జలపాతం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సాహసోపేతమైన ట్రెక్కింగ్‌లకు ప్రసిద్ధి చెందింది.
తలైయార్ జలపాతం
(తమిళనాడు)
అందాల లోయలకు ప్రసిద్ధి చెందిన అరకులో కటికి జలపాతం ఉంది. కొంత దూరం ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి చేరుకోవాలి.
కటికి జలపాతం
(ఆంధ్రప్రదేశ్)
భారతదేశంలోని రెండవడి జోగ్ జలపాతం. ఇది 830 అడుగుల ఎత్తు నుండి అద్భుతమైన ప్రకృతి అందాలతో విలసిల్లుతుంది.
జోగ్ జలపాతం
(కర్ణాటక)
ఇరుప్పు జలపాతం కర్ణాటకలో చాల ఫేమస్. పురాతన ఇతిహాసాలు, ప్రకృతితో అనుసంధానించబడిన ప్రశాంతమైన తీర్థయాత్ర స్థల జలపాతం ఇది.
ఇరుప్పు జలపాతం
(కర్ణాటక)
తమిళనాడులోని మరో అద్భుత జలపాతం హోగేనక్కల్. ఇది ప్రకృతి అందాలను నెలవు. ఇక్కడ కోరాకిల్ బోట్ రైడ్ థ్రిల్‌ను అనుభవించవచ్చు.
హోగేనక్కల్ జలపాతం
(తమిళనాడు)
దూధ్‌సాగర్ జలపాతం.. దీని గురించి వినే ఉంటారు. ఇది మంత్రముగ్ధులను చేసే నాలుగు అంచెల జలపాతం. వర్షాకాలంలో ఇది మరింత బాగుంది.
దూధ్‌సాగర్ జలపాతం (గోవా-కర్ణాటక సరిహద్దు)
కుట్రాలం జలపాతం తమిళనాడులో ఉన్న అద్భుతమైన జలపాతల్లో ఒకటి. ఇక్కడ స్నానం రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది.
కుట్రాలం జలపాతం
(తమిళనాడు)
80 అడుగుల ఎత్తుతో ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన అతిరాప్పల్లి జలపాతాలను ఒక్కసారైన చూడాలి. కేరళ వెళ్తే దీన్ని అస్సలు మిస్ చెయ్యకండి.
అతిరాప్పల్లి జలపాతం
(కేరళ)
మరిన్ని వెబ్ స్టోరీస్
రాత్రుళ్లు నిద్ర లేదా.? ఏ రాశి వారు ఏం చెయ్యాలంటే.?
బెస్ట్ సన్ రైజ్ చూడాలంటే.. ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..
ఈ టిప్స్ పాటిస్తే.. పసుపు రంగు క్లియర్.. మిల మిల మెరిసే దంతాలు..