అన్ని కాలాల్లో ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉండాలి. లేదంటే వివిద రకాల వైరస్, బ్యాక్టీరియాలు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేవువచ్చినప్పుడు సకాలంలో స్పందించి సీపీఆర్ చేస్తే, ఆ వ్యక్తిని రక్షించవచ్చంటున్నారు నిపుణులు
రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని విటమిన్లుండే ఆహార పదార్థాల్ని రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి
ఫలితంగా ఏ సీజన్‌లో అయినా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం
విటమిన్లలో విటమిన్ ‘సి’ లోపం ఉన్న వాళ్లు త్వరగా జబ్బు పడే అవకాశాలుంటాయి. అందుకే ఆహారంలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండాలి
కమలాపండ్లు, నిమ్మకాయ.. వంటి నిమ్మజాతి పండ్లు, పాలకూర, క్యాప్సికం.. వంటి కూరగాయాల్లో కూడా విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడుతుంది
రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో విటమిన్ ‘బి6’ సహకరిస్తుంది. అరటిపండ్లు, బంగాళాదుంపలు, చికెన్, చేపలు, శెనగలు.. వంటి ఆహార పదార్థాల్లో ఇది అధికంగా ఉంటుంది
విటమిన్ ‘ఇ’ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ విటమిన్ ఎక్కువగా లభించే పొద్దుతిరుగుడు గింజలు, పల్లీలు, బాదంపప్పులు, పాలకూర, నట్స్.. ఆహారాల్లో ఉంటుంది
విటమిన్ ‘ఎ’లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. క్యారట్స్, తర్బూజా, గుమ్మడికాయ, సొరకాయ.. వంటి పండ్లలో విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది