పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు వర్షాకాలంలో అస్సలు తినకూడదు. ఈ సమయంలో కూరగాయల్లో ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి
TV9 Telugu
వర్షాకాలంలో ఈ విధమైన కూరగాయలు ఆహారంలో తీసుకుంటే కడుపు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమయంలో డయేరియా, గ్యాస్ సమస్యలు వంటి వ్యాధులు దాడిచేసే ప్రమాదం ఉంది
ముల్లంగి, క్యారెట్, బంగాళాదుంప వంటి రూట్ వెజిటేబుల్స్ తేమ ఉన్న రోజుల్లో తినకూడదు. ఇలాంటి దుంప కూరగాయలు వివిధ అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి
TV9 Telugu
ఈ సమయంలో వంకాయలకు పురుగు పట్టకుండా ఉండేందుకు రైతులు విషపూరిత రసాయనాలు వాడుతారు. వర్షాకాలంలో చీడపీడలను తరిమికొట్టడానికి వంకాయ పంటలపై ఎక్కువగా వీటిని వినియోగిస్తారు
TV9 Telugu
వర్షాకాలంలో పుట్టగొడుగులను అస్సలు తినకూడదు. మట్టి నుండి వ్యాధికారక రసాయనాలు వీటితో పాటు వంటిట్లోకి వచ్చేస్తాయి. దాని నుండి పలు రకాల అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
వర్షాకాలంలో బీన్స్‌కు కూడా దూరంగా ఉండాలి. వర్షాకాలం ప్రారంభ సమయానికి ముందే వీటిల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి బీన్స్ తినడం సురక్షితం కాదు
TV9 Telugu
వర్షాకాలంలో అన్ని కూరగాయలను నీటితో బాగా కడిగి వినియోగించాలి. సరైన ఉష్ణోగ్రత వద్ద వంట చేయడం కూడా అవసరం
TV9 Telugu
ఈ విధమైన కూరగాయలకు బదులుగా కాకర కాయ, గుమ్మడికాయ, రొయ్యలు వంటి వాటిని తినడం చాలా ముఖ్యం. ఫలితంగా ఒంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో పచ్చి కూరగాయలు తినకూడదు