Ravi Kiran
17 June 2024
గొడవలు లేని బంధాలు అంటూ ఉండవు. కొందరు చిన్న చిన్న గొడవలతోనే విడాకుల వరకు వెళ్తుంటే.. మరికొందరు ఆ గొడవలు, మనస్పర్ధల నుంచే తమ ప్రేమను మరింతగా బలోపేతం చేసుకుంటారు.
అయితే ఒక్కోసారి మగాళ్లు చేసే చిన్న చిన్న పొరపాట్లు బంధాన్ని విడగొట్టే స్థాయికి దారి తీస్తుంది. ఎంతగా అంటే ఇక నీకు.. నాకు రాం..రాం.. అనేట్టుగా ఆ గొడవ ఉంటుంది.
అందుకే ఆలుమగల మధ్య ఈ పొరపాట్లను అస్సలు రానివ్వకండి. అలాగే మగాళ్లు ఎప్పుడూ కూడా మీ భాగస్వామి ముందు ఈ తప్పులు చేయకండి.
సరదాగా ఏదో నొప్పించే మాట అనడం లేదా ఫీలింగ్స్ హార్ట్ అయ్యేలా మాట్లాడటం వంటివి మానుకోండి. కొన్నిసార్లు ఇది మీ భాగస్వామిని గట్టిగా హార్ట్ చేస్తుంది. అది ఏకంగా మీ బంధాన్ని విడగొట్టే స్థాయికి వెళ్తుంది కూడా.
మాజీ ప్రేమికుడి గురించి లేదా ఎక్స్-లవ్ గురించి ఎప్పుడూ మాట్లాడకండి. ఓ మహిళకు ఎప్పుడూ కూడా తన భాగస్వామి వేరే అమ్మాయి గురించి చెప్పడం, ఆమెను తలుచుకోవడం లాంటివి అస్సలు నచ్చదు. దీంతో భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు చెడిపోతాయి.
మీ భాగస్వామి అనవసరమైన విషయాల గురించి పదేపదే మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు. ఈ విషయం తెలిసి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ విషయాలు ప్రస్తావన తీసుకురావడం ఖచ్చితంగా మంచిది కాదు. ఇది ఇద్దరి మానసిక స్థితిని పాడు చేస్తుంది.
జీవిత భాగస్వామిపై అనుమానం ఉండటం కూడా బంధం విచ్ఛిన్నానికి ప్రధాన కారణం. మీ జీవిత భాగస్వామి మొబైల్‌ని.. ఆమె లేనప్పుడు చూడటం, అలాగే వారి కదలికలను ప్రశ్నించడం లాంటివి ఇద్దరి మానసిక స్థితిని ఇబ్బందికి గురి చేస్తుంది.
మీ జీవిత భాగస్వామిపై కొన్ని సందర్భాల్లో.. మీకు కోపం రావడం సహజం. కానీ కోపం వచ్చింది కదా అని ఆమెపై అరవకండి.
అలా అరిస్తే.. ఆమె హార్ట్ అయ్యి.. డిప్రెషన్‌కి వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు మీ భాగస్వామితో కోపంగా ఉన్నప్పుడు, వీలైనంత ప్రశాంతంగా వ్యవహరించండి. లేకపోతే మౌనం పాటించండి.