అబ్బాయిలు పెళ్లికి రెడీ అవుతున్నారా..? అమ్మాయిని ఈ 4 ప్రశ్నలు అడగండి..

27 June 2024

Shaik Madar Saheb

వివాహం అనేది పవిత్ర బంధం.. పెళ్లి ఇద్దరు మనుషుల కలయిక మాత్రమే కాదు, అంతకు మించినది. అందుకే.. ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి..

పెళ్లి జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయం.. దీని కోసం వేసే ప్రతి అడుగు ఆలోచనాత్మకంగా వేయాలి.. లేకుంటే మొత్తం జీవితమే నాశనం అవుతుంది. 

పెళ్లి చేసుకునేందుకు రెడీ అయినప్పుడు.. పెండ్లిచూపులకు ఇష్టమైన అమ్మాయి ఇంటికి వెళతారు.. అక్కడ పెద్దలు అన్ని విషయాలను మాట్లాడుకుంటారు.. 

అబ్బాయి, అమ్మాయి ఒకరితో ఒకరు మాట్లాడటానికి కూడా అవకాశం ఉంటుంది.. అప్పుడు అబ్బాయి.. అమ్మాయిని కచ్చితంగా ఈ 4 ప్రశ్నలు అడగడం బెటర్..

మీకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలి?.. ప్రతి వ్యక్తి ప్రాధాన్యతలు, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి.. కావున వారి అభిప్రాయాలను తెలుసుకోండి..

మీ ఎంపిక ఏమిటి?..  సంబంధం గురించి అబ్బాయి.. అమ్మాయి.. ఇష్టాలు, అయిష్టాల గురించి వివరణాత్మక సమాచారాన్ని పొందాలి. అప్పుడు ఓ క్లారిటీ వస్తుంది..

వెజ్ తింటారా? లేదా నాన్ వెజ్?..  అబ్బాయి అయినా, అమ్మాయి అయినా మీ కాబోయే జీవిత భాగస్వామిని దీనిని ఖచ్చితంగా అడగాలి..

మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?.. పెళ్లి తర్వాత ఎలాంటి జీవితం గడపాలనది.. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. కావున ఇది తెలుసుకోవడం ఉత్తమం..

ఈ ప్రశ్నల తర్వాత అబ్బాయికి అమ్మాయి అభిప్రాయాల గురించి ఓ క్లారిటీ వస్తుంది.. దీంతో వివాహానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం సులభతరం అవుతుంది.