మే నెల టూర్‌కి మహారాష్ట్రలోని ఈ ప్రదేశలు బెస్ట్ ఆప్షన్..
09 May 2025
Prudvi Battula
మహాబలేశ్వర్: ఇది మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటి స్ట్రాబెర్రీ పొలాలు, పచ్చని లోయలను ఆస్వాదించవచ్చు. ఇది మే నెలలో చల్లగా ఉంటుంది.
లోనావాలా: ఈ పట్టణం జలపాతాలు, గుహలు, కోటలతో విలసిల్లుతుంది. ఇక్కడ మే నెలలో ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
మాథెరన్: ఇది వాహనాల శబ్దం లేని ఓ హిల్ స్టేషన్. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశం. ముంబై నుండి 90 కి.మీ దూరంలో ఉంది.
భండార్దర: ఇది అహ్మద్‌నగర్ జిల్లాలోని ఉంది. విల్సన్ ఆనకట్ట,రంధా జలపాతం, ఆర్థర్ సరస్సుతో ప్రశాంతమైన వాతావరణం, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది.
అంబోలి: సింధుదుర్గ్‌లోని ప్రశాంతమైన కొండ ప్రాంతం. దట్టమైన అడవులు, పొగమంచుతో కూడిన జలపాతాలతో మే నెలలో చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.
పంచగని: ఇక్కడ మే నెలలో మాప్రో గార్డెన్ టేబుల్ ల్యాండ్, పార్సీ పాయింట్ లు అద్భుతమైన దృశ్యాలు, స్ట్రాబెర్రీ తోటలతో ఆహ్లాదకరంగా ఉంటాయి.
తార్కర్లి: మీరు బీచ్‌లను ఇష్టపడితే మే నెలలో తార్కర్లి మంచి ఎంపిక. మాల్వాన్ సమీపంలోని ఈ తీరప్రాంత గ్రామంలో శుభ్రమైన ఇసుక బీచ్‌లు ఉంటాయి.
చిఖల్దార: విదర్భ ప్రాంతంలోని ఏకైక హిల్ స్టేషన్ చిఖల్దార, అందమైన వ్యూ పాయింట్లు, మే నెలలో కూడా చల్లని వాతావరణంతో ఆకట్టుకుంటుంది.
ఇగత్పురి: నాసిక్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం. సహ్యాద్రి కొండలతో చుట్టుముట్టబడి ఉంది. అనేక హైకింగ్, ట్రెక్కింగ్ ట్రైల్స్‌ను కలిగి ఉంది.
అలీబాగ్: మీరు తీరప్రాంతాన్ని ఇష్టపడితే, ముంబై నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండానే అలీబాగ్ బీచ్‌లో విశ్రాంతి తీసుకువచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అరటి తొక్కతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా.?
ఇది ప్రపంచంలోనే సంపన్న ఇస్లాం దేశం..
ఈ మిస్టీరియస్ హిందూ దేవాలయాలు శాత్రవేత్తలకు సవాలు..