02 September 2024
TV9 Telugu
Pic credit - Pexels
బచ్చలికూరలో ప్రొటీన్లతో పాటు విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి12, కె, కాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి.
బచ్చలికూరలో ఉండే పోషకాలు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బచ్చలికూర ముఖ్యంగా కళ్ళకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
అయితే బచ్చలికూరను ఎక్కువగా తిన్నా.. లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తిన్నా ఆరోగ్యానికి అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బచ్చలికూర తినకుండా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఆక్సలేట్ అనే పదార్థం మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యను పెంచుతుంది.
బచ్చలికూరలో హిస్టామిన్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది చాలా మందికి అలెర్జీని కలిగిస్తుంది. అందుకే బచ్చలికూర తిన్నాక ఏదైనా సమస్య వస్తే మాత్రం తినకూడదు.
కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు బచ్చలికూర తినకూడదు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీ రోగులకు మంచిది కాదు.
విటమిన్ K1 బచ్చలికూరలో ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. రక్తం పలచ బాదడానికి మందులు తీసుకునే వ్యక్తులకు ఇది హానికరం.
బచ్చలి కూరలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంది. కనుక దీనిని ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.